![]() |
![]() |
(2).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 86 లో.....కళ్యాణ్ ని విడిపించినందుకు జాను వాళ్ళ అమ్మపై కోప్పడుతుంది. దయచేసి పోలీసులు కేసు అంటూ తిరుగుతూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదని శారద చెప్తుంది. జాను ఇవన్నీ ఏం ఆలోచించకు ఎక్కడికో వెళ్తున్నావ్ కదా అటు ముందు వెళ్ళు.. అల్ ది బెస్ట్ అని మురళి అంటాడు. మరొకవైపు జానూ వచ్చి పెళ్లి విషయం మాట్లాడుతుందని సూర్య హ్యాపీగా ఫీల్ అవుతాడు.
బాబు గారికి అసలు విషయం తెలిస్తే ఏమవుతుందోనని తుఫాన్ అంటాడు. అప్పుడే సింహాద్రి కుటుంబంతో సహా భువన ఇంటికి వస్తాడు. జాను వచ్చినట్లు ఉందని సూర్య ఎక్సైట్ అవుతాడు కానీ నిత్య వస్తుంది. బావ అంటూ సూర్యని హగ్ చేసుకుంటుంది. ఏంటి ఇదంతా అని సూర్య చిరాకు పడుతాడు. ఈ రోజు నీ పుట్టినరోజు కాదు.. నా పుట్టినరోజు కాదు ఏంటి స్పెషల్ అని సూర్య అంటాడు. బావ నువ్వు నా నోటితో చెప్పించాలని చూస్తున్నావ్ కదా ఈ రోజు మన ఎంగేజ్మెంట్ అని నిత్య అనగానే సూర్య షాక్ అవుతాడు. మమ్మీ అంటూ కిందకి వెళ్తాడు సూర్య. ఏంటి మమ్మీ ఇదంతా అని సూర్య అడుగుతాడు. ఈ రోజు నీ ఎంగేజ్మెంట్ అని భువన అంటుంది. దాంతో సూర్య షాక్ అవుతాడు. నాకు తెలియకుండా ఇదంతా ఏంటని సూర్య కోప్పడుతాడు.
ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని సింహాద్రితో సూర్య అంటాడు. నన్ను క్షమించండి అన్నయ్య.. ఇలా సారీ ఎవరికి చెప్పలేదని భువన లోపలికి వెళ్లి పాయిజన్ బాటిల్ తీసుకొని వచ్చి తాగుతుంది. అమ్మ హాస్పిటల్ కి వెళదామని సూర్య అంటాడు. మీరు ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాకనే వెళదామని భువన అనగానే సూర్య వెంటనే నిత్యకి రింగ్ తొడుగుతాడు. సూర్యకి నిత్య రింగ్ తొడుగుతుంది. అప్పుడే జాను వచ్చి సూర్య ఎంత మోసం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |